విభజన హామీలు మరిచిన బీజేపీని బొంద పెట్టాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

విభజన హామీలు మరిచిన బీజేపీని బొంద పెట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకై కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Update: 2024-05-10 16:15 GMT

దిశ, హుస్నాబాద్ ; విభజన హామీలు మరిచిన బీజేపీని బొంద పెట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకై కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్న కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. బిజెపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి కుట్రలు పొందుతూ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తొలగించడానికి 400 సీట్లు అడుగుతున్నదని అలాంటి బీజేపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూసే బాధ్యత హుస్నాబాద్ ప్రాంత ప్రజలదని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ ల గురించి బిజెపి , బి ఆర్ ఎస్ పార్టీలు గొంతు చించుకుంటున్నాయని కేంద్రంలో ఉన్న బిజెపి ఒక్కొక్కరి ఖాతాలో జన్ధన్ యోజన కింద 15 లక్షలు వేస్తామని రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మ బలికిన బిజెపికి , 3016 రూపాయల నిరుద్యోగ భృతి డబుల్ బెడ్ రూములు రైతు రుణమాఫీ చేయని బి.ఆర్.ఎస్ పార్టీ కూడా దిగజారి కాంగ్రెస్ పార్టీ విమర్శించే స్థాయికి రావడం సిగ్గుచేటు అన్నారు. అభివృద్ధిలో భాగంగా దినదినం విస్తరిస్తున్న హుస్నాబాద్ ప్రాంతానికి నాలుగు రహదారులతో కరీంనగర్- కొత్తపల్లి నుండి హుస్నాబాద్ రోడ్డు లో నాలుగు లైన్ల రోడ్డుతో త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News