రైతు వ్యతిరేక పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ : కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు మేక మల్లేశం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి, జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

Update: 2024-05-10 16:06 GMT

దిశ, మద్దూరు : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు మేక మల్లేశం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి, జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మోసం చేసి గెలిచారని, పీబి నెంబర్ 25 లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, సంవత్సరంలోపు నేరం రుజువై పదవి కోల్పోతాడని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, భూకబ్జాలు దోపిడీలకు పాల్పడ్డారని తెలిపారు. లిక్కర్ స్కామ్ లో కూతురు తీహార్ జైలులో ఉంటే కేసీఆర్ సిగ్గు లేకుండా బస్సు యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఃకేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 9 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని, ఆగస్టు 15 లోపు రెండు లక్షలు రుణమాఫీ చేసి తీరుతామని హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు . మోడీ డ్రెస్సులు మార్చడం విదేశాలు తిరగడం తప్ప దేశాన్ని అభివృద్ధి చేయలేదని అన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం బిఆర్ఎస్ బిజెపిలకు పార్లమెంటు ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని, బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారని,భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాజలింగం,జెడ్పిటిసి గిరి కొండల్ రెడ్డి, జిల్లా నాయకులు పిఎసిఎస్ వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి,జక్కిరెడ్డి సుదర్శన్ రెడ్డి, ఆరిఫ్,మండల ప్రధాన కార్యదర్శి ఊట్ల శ్రీధర్ రెడ్డి , మండల నాయకులు తాజ్,తాజా మాజీ సర్పంచ్ కంటారెడ్డి జనార్దన్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News