విచారం వ్యక్తం చేసిన జనసేనాని.. వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం

జనసేన పార్టీ నిర్వహిస్తున్న కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం బాపట్ల జిల్లాలో పర్యటించారు.

Update: 2022-06-19 13:22 GMT

దిశ, డైనమిక్​బ్యూరో : జనసేన పార్టీ నిర్వహిస్తున్న కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం బాపట్ల జిల్లాలో పర్యటించారు. చిమటవారి పాలెం, డేగలముడిలో గ్రామాల్లో ఆత్యహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలను పవన్​పరామర్శించారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 80 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. వరుసగా పంట నష్టాలు రావడం, బోర్లు వేసిన నీళ్లు పడకపోవడం, సాగు కోసం చేసిన రూ.16 లక్షలు అప్పు తీర్చే మార్గం లేక బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పి ఓ కుటుంబం పవన్ ముందు బోరున విలపించారు. వారిని పవన్​ ఓదార్చారు. అనంతరం మద్దనపూడి మండలం యనమదలలో రైతు భరోసా యాత్ర సాగింది. 

Similar News