ఫేక్ డాక్టర్ అరెస్ట్…

ఎంబిబిఎస్ డాక్టర్ అవతారం ఎత్తిన ఓ నకిలీ వైద్యున్ని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పట్టుకున్నారు.

Update: 2024-05-03 16:11 GMT

దిశ, సికింద్రాబాద్: ఎంబిబిఎస్ డాక్టర్ అవతారం ఎత్తిన ఓ నకిలీ వైద్యున్ని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని తుకారంగేట్ రియో పాయింట్ హోటల్ సమీపంలో వెంకటేశ్వర్ రెడ్డి (41) అనే నకిలీ వైద్యుడు వాయు క్లినిక్ పేరుతో క్లినిక్ నడుపుతున్నాడు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్పెక్టర్ గోవింద్ సింగ్, అనీల్ , సిబ్బందితో కలిసి క్లినిక్ పై దాడులు నిర్వహించారు. ఫేక్ డాక్టర్ కు ఎటువంటి సర్టిఫికేషన్ లేకపోవడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా మందులు కూడా విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

ఎటువంటి డ్రగ్ లైసెన్స్ లేకుండా క్లినిక్ లో నిల్వ ఉన్న యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, ఇలాంటి అల్సర్ డ్రగ్స్ తో పాటు 44 రకాల మందులు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు రైల్వే కు సంబంధించిన మందులు కూడా దొరికినట్లు చెప్పారు. వీటి విషయంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. రూ 1,60 లక్షలు విలువగల మందులు సీజ్ చేసి, వెంకటేశ్వర్ రెడ్డి స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Similar News