డీజే టిల్లు డైరెక్టర్‌తో నాగచైతన్య నెక్ట్స్ సినిమా
దిశ,వెబ్‌డెస్క్: నాగచైతన్య లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగ్రేట్రం చేశారు.
దిశ,వెబ్‌డెస్క్: నాగచైతన్య లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగ్రేట్రం చేశారు. ఈ సినిమా తో బాలీవుడ్లో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్న చై.. ఆగస్టు 11న లాల్ సింగ్ చద్దా విడుదల అవుతుండటంతో ప్రమోషన్స్‌లో అమీర్ ఖాన్‌తో కలిసి ఫుల్ బిజీగా గడుపుతున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగచైతన్య. డీజే టిల్లు సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ విమల్ కృష్ణ తన నెక్ట్స్ మూవీ నాగచైతన్యతో చేయబోతున్నట్లు టాలీవుడ్లో వినిపిస్తోంది. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా విడుదల తర్వాత డైరెక్టర్ విమల్ కృష్ణతో సినిమా సెట్స్ పై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.