బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు : కోమటిరెడ్డి

బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని బీజేపీ గ్రామస్థాయిలో ఓటు బ్యాంకు లేదని కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Update: 2024-05-04 16:43 GMT

దిశ, యాచారం : బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని, బీజేపీ గ్రామస్థాయిలో ఓటు బ్యాంకు లేదని, కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని, మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం యాచారం మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఎంపీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డితో భారీ ర్యాలీలో పాల్గొని. కార్నర్ మీటింగులో మాట్లాడారు.. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను ఎవరు గుర్తుపట్టారని బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్, డాక్టర్ వృత్తికె పరిమితమవుతారని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ పేద ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ధరణి పోర్టల్ అవినీతితో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని ఫైర్ అయ్యారు. హస్తం గుర్తుకు ఓటు వేసి లక్ష ఓట్ల మెజార్టీతో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుందని 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ తోనే రాష్ట్రంలో దేశంలో పేదలకు న్యాయం జరుగుతుందని తనను గెలిపిస్తే అభివృద్ధిని చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, బి.యన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి, పోలమాని రామకృష్ణ యాదవ్, గౌరారం వెంకట్ రెడ్డి, నాయిని సుదర్శన్ రెడ్డి, పాల్గొన్నారు.

Similar News