Margaret Alva: 'ఈగో 'లకు సమయం కాదు.. అండగా నిలవాలని మార్గరెట్ అల్వా విజ్ఞప్తి

Margaret Alva Says, She believes mamata Banerjee Support Opponent Vice Presidential Candidate| ఉపరాష్ట్రపతి ఎన్నికలకు టీఎంసీ దూరంగా ఉండడంపై విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈగోలకు ఇది సమయం కాదని అన్నారు

Update: 2022-07-22 11:40 GMT

న్యూఢిల్లీ: Margaret Alva Says, She believes mamata Banerjee Support Opponent Vice Presidential Candidate| ఉపరాష్ట్రపతి ఎన్నికలకు టీఎంసీ దూరంగా ఉండడంపై విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈగోలకు ఇది సమయం కాదని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో టీఎంసీ నిర్ణయం బాధ కలిగిస్తోంది. ఇది అహాం లేదా కోపాన్ని చూపించడానికి సమయం కాదు. ఇది ధైర్యం, నాయకత్వం కోసం ఐక్యతను ప్రదర్శించే సమయం. ధైర్యానికి ప్రతిరూపమైన మమతా బెనర్జీ ప్రతిపక్షానికి అండగా నిలుస్తారని నేను నమ్ముతున్నాను' అని ట్వీట్ చేశారు. కాగా, అంతకుముందు రోజు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు తాము దూరంగా ఉంటున్నట్లు టీఎంసీ ప్రకటిచింది. అయితే ఎన్డీఏ అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ ను ప్రకటించినపుడు మమతా సమావేశంలో లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో తాను లేకుండానే అభ్యర్థిని ప్రకటించడంపై టీఎంసీ నిరసన వ్యక్తపరిచింది.

ఇది కూడా చదవండి: అగ్నిపథ్ అల్లర్లు భారత రైల్వేకు తీవ్ర నష్టం కలిగించాయి

Tags:    

Similar News