దిశ ఎఫెక్ట్.. స్పందించిన అధికారులు

తాండూరు మండలం కరన్ కోట్ గ్రామ పంచాయితీలోని బస్టాప్ సమీపంలోని మురుగు కాల్వలో ప్లాస్టిక్ డబ్బాలతో కూడిన చెత్తాచెదారం పేరుకుపోవడంతో " బాబోయ్ దోమలు.. ""అని గురువారం దిశ లో ప్రచురితమైన విషయం తెలిసిందే.

Update: 2024-05-24 11:34 GMT

దిశ, తాండూరు : తాండూరు మండలం కరన్ కోట్ గ్రామ పంచాయితీలోని బస్టాప్ సమీపంలోని మురుగు కాల్వలో ప్లాస్టిక్ డబ్బాలతో కూడిన చెత్తాచెదారం పేరుకుపోవడంతో " బాబోయ్ దోమలు.. ""అని గురువారం దిశ లో ప్రచురితమైన విషయం తెలిసిందే. కాగా దిశ కథనానికి ఎంపీడీవో విశ్వప్రసాద్ స్పందించారు.ఎంపీడీవో ఆదేశాల మేరకు పంచాయతీ సెక్రటరీ ఆనంద్ రావు పారిశుద్ధ్య కార్మికులతో ఆ ప్రాంతంలో ఉన్న మురుగు కాలువల్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు, చెత్తచెదరం శుభ్రం చేయడంతో పాటు మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టారు.దోమల నివారణకు మురికి కాలువల్లో ఆయిల్‌బాల్స్‌ వేయించినట్లు చెప్పారు.సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరింపజేసిన దిశకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News