నాని ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'అంటే సుందరానికీ' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అంటే సుందరానికీ’.
దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'అంటే సుందరానికీ'. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటించింది. ఈ మూవీ జూన్ 10న విడుదలై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా జూలై 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో అందుబాటులోకి రాబోతుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ అధికారికంగా ప్రకటించింది. ''సుందర్ లీలా వెడ్డింగ్ స్టోరీని చూసేందుకు మీ అందరినీ సాధరంగా ఆహ్వానిస్తున్నాం తేదీ గుర్తుంచుకోండి'' అంటూ ఓ పోస్టర్‌ను కుడా విడుదల చేసింది.