ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనకారులకు జాబ్ ఆఫర్ చేసిన సీఈఓ

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా యూనివర్శిటీల్లో ఇవి మరింత ఎక్కువగా జరుగుతున్నాయి.

Update: 2024-05-03 11:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా యూనివర్శిటీల్లో ఇవి మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. గురువారం కాలిఫోర్నియా యూనివర్శిటీలో పాలస్తీనాకు అనుకూలంగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఉద్రిక్తతలు ఇతర దేశాలకు సైతం వ్యాప్తి చెందాయి. ఈ నేపథ్యంలో ఒక కంపెనీ సీఈఓ క్యాంపస్‌లో ఇజ్రాయెల్‌‌కు వ్యతిరేకంగా నిరసనలు చేసిన విద్యార్థులను తన కంపెనీలో ఉద్యోగులుగా నియమించుకోనున్నట్లు ప్రకటించారు. న్యూయార్క్ సిటీ సబ్‌వేలో అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్‌లకు ప్రసిద్ధి చెందిన టెలిహెల్త్, ఆన్‌లైన్ ఫార్మసీ అయిన హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ పాలస్తీనా సంతతికి చెందిన వాడు. ఆయన ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తున్నాడు. హిమ్స్ కంపెనీ మగవారి జుట్టు రాలడం, అంగస్తంభన సమస్యలకు చికిత్స చేయడంలో ప్రత్యేకత కలిగిన సంస్థ. ఉపాధి అవకాశాలను అన్వేషిస్తున్న పాలస్తీనా అనుకూల నిరసనకారులకు ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానం పంపాడు. ఇజ్రాయెల్, పాలస్తీనాలో చేస్తున్న మారణహోమానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని యూనివర్సిటీ క్రమశిక్షణతో సంబంధం లేకుండా నియమించుకోవడానికి చాలా కంపెనీలు, సీఈవోలు ఆసక్తిగా ఉన్నారని ఎక్స్‌లో ఆండ్రూ రాశారు.

Similar News