Oppo India: రూ. 4,389 కోట్ల సుంకాలను ఎగ్గొట్టిన ఒప్పో ఇండియా!

Directorate of Revenue Intelligence Says, Oppo India Evaded 4,389 Crore Taxes| చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో దేశీయంగా భారీ అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఏకంగా రూ. 4,389 కోట్ల మేర కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసినట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ బుధవారం

Update: 2022-07-13 10:00 GMT

న్యూఢిల్లీ: Directorate of Revenue Intelligence Says, Oppo India Evaded 4,389 Crore Taxes| చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో దేశీయంగా భారీ అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఏకంగా రూ. 4,389 కోట్ల మేర కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసినట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒప్పోతో పాటు అనుబంధ సంస్థల కార్యాలయాలు, ఉన్నత ఉద్యోగుల నివాసాల్లో జరిగిన సోదాల అనంతరం ఈ విషయం నిర్ధారణ జరిగిందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ తెలిపింది. మొబైల్‌ఫోన్‌ల తయారీ కోసం అవసరమైన కొన్ని వస్తువులు భారత్‌కు దిగుమతి చేసుకున్న ఒప్పో వాటి వివరాలను తప్పుగా నమోదు చేసింది. ఇలా తప్పుడు వివరాల వల్ల ఒప్పో ఇండీయా రూ. 2,981 కోట్ల వరకు పన్ను మినహాయింపును పొందిందని, సంస్థలోని కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్ఐ) పేర్కొంది.

అదేవిధంగా చైనాలోని ఇతర సంస్థలకు లైసెన్స్ ఫీజులు, రాయల్టీ చెల్లించే విషయంలో కూడా ఒప్పో ఇండియా రూ. 1,408 కోట్ల వరకు సుంకాలను ఎగవేసినట్టు సమాచారం. పన్ను ఎగవేతలకు సంబంధించి ఒప్పో ఇండియా ఇప్పటికే స్వచ్ఛందంగా రూ. 450 కోట్లను చెల్లించింది. బకాయిలు, పెనాల్టీలు కలిపి రూ. 4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని చెల్లించాల్సి ఉందని, అందుకోసం ఒప్పో ఇండియాకు షోకాజ్ నోటీసులను కూడా జారీ చేసినట్టు డీఆర్ఐ స్పష్టం చేసింది. ఒప్పో ఇండియా భారత్‌లో ఒప్పో, రియల్‌మీ, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోంది. దేశీయంగా తయారీ, అసెంబ్లింగ్, హోల్‌సేల్ ట్రేడింగ్, మొబైల్ ఉపకరణాలను విక్రయిస్తోంది.


Also Read: ప్రయాణికులకు అలర్ట్.. 212 రైళ్లు క్యాన్సిల్

Tags:    

Similar News