ప్రయాణికులకు అలర్ట్.. 212 రైళ్లు క్యాన్సిల్..

by Disha Web Desk 2 |
ప్రయాణికులకు అలర్ట్.. 212 రైళ్లు క్యాన్సిల్..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు.. వీధులు.. ఊరులు నీట మునిగాయి. ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది. అంతేకాకుండా ఈ వర్షాల కారణంగా భారతీయ రైల్వే బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వెల్లువెత్తుతున్న వరదల వల్ల పలు రాష్ట్రాలలో 212 రైళ్లను రద్దు చేసింది. దీంతో పాటు దేశంలో మరో 27 రైళ్లను తగ్గించాలని, మరో 25 రైళ్లను పాక్షికంగా రద్దు చేయాలని నిర్ణయించింది.

రైళ్లు రద్దైన రాష్ట్రాలు:

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, న్యూఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, జమ్మూ కాశ్మీర్, అస్సాం మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఏయే రైళ్లను రద్దు చేశారు అనే వివరణను రైల్వే తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.


Next Story

Most Viewed