హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు అదరిపోయే న్యూస్

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా నెగిటివ్ వచ్చింది. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన నాలుగు రోజుల వార్మప్

Update: 2022-07-04 05:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా నెగిటివ్ వచ్చింది. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన నాలుగు రోజుల వార్మప్ గేమ్‌లో అనంతరం రోహిత్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఇంగ్లాండ్ 5వ టెస్ట్‌కు రోహిత్ దూరమయ్యాడు. అప్పటి నుంచి రోహిత్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం అతనికి కరోనా నెగిటివ్ రావడంతో జులై 7న ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. దీంతో రోహిత్ ఈ రోజు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

Similar News