ఎంసెట్ ఫలితాల్లో దుమ్మురేపిన BC గురుకుల స్టూడెంట్స్.. అభినందించిన మంత్రి, ఆఫీసర్లు

విద్యాశాఖ ప్రకటించిన ఎంసెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బా పూలే బీసీ గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి

Update: 2024-05-18 17:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యాశాఖ ప్రకటించిన ఎంసెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బా పూలే  బీసీ గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి విజయఢంకా మోగించారు. అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి అనే విద్యార్ధిని 369వ ర్యాంక్ సాధించింది. ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షలో అగ్రికల్చర్ విభాగంలో అత్యధిక మంది విద్యార్థులు ర్యాంక్‌లు సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 145 మంది బాలికలు పరీక్ష రాయగా 114 మంది అర్హత సాధించారు. ఐదువేల లోపు ర్యాంకర్లు 12 మంది, పదివేల లోపు ర్యాంక్ లు 29 మంది బాలికలు ఉన్నారు.

బీ నాగలక్ష్మి (2021), ఏ శిరిష ( 2547),  బీ.అనుష(3181), దివ్య(3224), బీ, హర్షిత(3228), జీ. మోనిక(3685), ఏ, ప్రవల్లిక(4170) ఏ రమ్య(4480) సాత్విక(4732), రిషిత(4786), నిఖిత(4861) లు ఐదువేల లోపు ర్యాంక్‌లు సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో జీ క్రాంతి కుమార్ (3735) ర్యాంక్ సాధించాడు. ఇక ఇంజనీరింగ్ విభాగంలో 276 మంది బాలికలు పరీక్ష రాయగా వారిలో ఇద్దరు పదివేల లోపు ర్యాంక్ సాధించారు. 191 మంది అర్హత సాధించారు. 135 మంది బాలురు పరీక్ష రాయగా వారిలో 5 మంది బాలురు పదివేల లోపు ర్యాంక్‌లు సాధించారు. 107 మంది క్వాలిఫై అయ్యారు. 

వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు మరిన్ని ర్యాంక్‌లు సాధించేలా ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించాలని, విద్యార్థులు మరింత కష్టపడి మంచి ర్యాంక్‌లు సాధించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో గురుకులాలు పనిచేస్తున్నాయని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం సంతోషాన్ని వ్యక్తం చేశారు. ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులను మహ్మాతా జ్యోతి బా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి బడుగు సైదులు అభినందించారు.

Similar News