CM Jagan: మోడీతో జగన్ నివేదించిన అంశాలివే..!

దిశ, వెబ్ డెస్క్: ప్రత్యేక విమానంలో బయలుదేరిన..CM Jagan Met PM Modi

Update: 2022-04-06 05:02 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రత్యేక విమానంలో బయలుదేరిన జగన్ ఢీల్లీకి చేరుకున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ర్టానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధానితో చర్చలు జరిపి.. వివిధ అంశాలాపై వినతి పత్రం సమర్పించాడు. కొత్త జిల్లాలు, రాష్ర్టానికి రావాల్సిన నిధులపై చర్చించిన్నట్లు తెలుస్తోంది. పోలవరం, కడప స్టీల్ ప్లాంట్ సహా రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అలాగే, రాష్ర్ట ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీకి సీఎం జగన్ విరించారు. అంతేకాకుండా నిధులను సకాలానికి విడుదల చేయాలని ప్రధాని మోడీని కోరారు. జగన్ నివేదించిన అంశాలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆయన కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో రహదారుల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణపై చర్చంచనున్నారు. అలాగే తీర ప్రాంతం వెంబడి నాలుగు లైన్ల్ రహదారులు నిర్మాణం చేపట్టాలని కొరారు. పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని గడ్కరీకి సీఎం రిక్వెస్ట్ చేయనున్నారు. 

Tags:    

Similar News