ప్రపంచ దేశాలు మొత్తం మోడీ వైపు చూస్తున్నాయి : ఎంపీ అభ్యర్థి భరత్

ప్రపంచ దేశాలు మొత్తం మోడీ వైపు చూస్తున్నాయని, మోడీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక పురోగతివైపు పరుగులు పెట్టిస్తున్నారని నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి భరత్ ప్రసాద్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు.

Update: 2024-04-30 08:36 GMT

దిశ, తలకొండపల్లి : ప్రపంచ దేశాలు మొత్తం మోడీ వైపు చూస్తున్నాయని, మోడీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక పురోగతివైపు పరుగులు పెట్టిస్తున్నారని నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి భరత్ ప్రసాద్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తలకొండపల్లి మండలంలోని బీజేపీ మండల అధ్యక్షుడు తిరుమణి రవి గౌడ్ ఆధ్వర్యంలో గట్టు ఇప్పలపల్లి, మెదక్ పల్లి, రాంపూర్, చంద్రధన, తలకొండపల్లి, పడకల్ గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్లకు ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు.

ఎంతోమంది విద్యార్థులు, కుల సంఘాలు ఉద్యోగస్తుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను 10 సంవత్సరాల పాటు కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని, 50 సంవత్సరాల పాటు మన రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నాయకులు మరోసారి మోసపూరిత వాగ్దానాలు చెప్పి అధికారంలోకి రావడానికి ఎన్నో అష్ట కష్టాలు పడ్డారని, ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన కల్వకుంట్ల కుటుంబం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను పేరు మార్చి తమ ప్రభుత్వం అందిస్తున్న పథకాలుగా ప్రచారం నిర్వహించి లబ్ధి పొందాలని విమర్శించారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయడం అంటే అంతా ఆశామాసి కాదని వారు ప్రజలకు వివరించారు. పార్లమెంటు ఎన్నికల్లోనైనా కనీసం భరత్ కుమార్ గెలుపు కోసం కమలం పువ్వుకు ఓటు వేసి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆచారి అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నీలకంఠ పాండు, కల్వకుర్తి తాలూకా ఇంచార్జ్ శేఖర్ రెడ్డి, పాండు ప్రసాద్, తాలూకా అసెంబ్లీ కన్వీనర్ అనిల్, కుమార్, శేఖర్ రెడ్డి మరికొంతమంది ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News