ప్రియా సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం

దిశ, మేళ్లచెరువు: మండల పరిధిలోని ప్రియా సిమెంట్ - Accident in Priya Cement Industry

Update: 2022-03-31 16:10 GMT

దిశ, మేళ్లచెరువు: మండల పరిధిలోని ప్రియా సిమెంట్ (రెయిన్)పరిశ్రమలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కంపెనీ ఉద్యోగి వేణు తో పాటు మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. పవర్ ప్లాంట్‌లోని బాయిలర్ వద్ద స్టీమ్ వాటర్ కార్మికుల మీద పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. రోజు వారిగా డ్యూటీ కి వెళ్లిన వారికి ప్రమాదం జరగడంతో తోటి కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గాయపడ్డవారిలో వేణు, నిగిడాల శ్రీనివాస్, రత్నాకర్ ఉన్నారు. బాధితులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.

Tags:    

Similar News