సొంతంగా నానో-ఉపగ్రహాన్ని నిర్మించుకుంటున్న స్కూల్

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం పెంపోందించడానికి, వారికి సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు ఓ పాఠశాల

Update: 2022-08-04 02:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం పెంపోందించడానికి, వారికి సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు ఓ పాఠశాల నానో-ఉపగ్రహాన్ని నిర్మించనుంది. దీనిని కోల్‌కతాకు చెందిన ప్రైవేట్ పాఠశాల అయిన సౌత్ పాయింట్ హైస్కూల్ నానో-ఉపగ్రహాన్ని తయారు చేయనుంది. ఎంపీ బిర్లా గ్రూప్‌లో భాగమైన సౌత్ పాయింట్ హైస్కూల్, బిజినెస్ గ్రూప్ మాజీ చైర్‌పర్సన్ ప్రియంవదా బిర్లా జ్ఞాపకార్థం ఈ ఉపగ్రహానికి 'ప్రియమ్వదాశాట్' అని పేరు పెట్టారు. అలాగే దీని రూపకల్పన, అభివృద్ధి, పరీక్ష, ఏకీకరణ, ప్రయోగానికి ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ అసోసియేషన్‌తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. శ్రీహరికోట నుంచి భూ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ఇస్రో పంపనుంది.

Similar News