కురుమలకు మరిన్ని అవకాశాలు వచ్చే ప్రయత్నం చేస్తాం: ఎమ్మెల్సీ మహేష్ గౌడ్

బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి ఉండే కానీ.. అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు

Update: 2024-04-29 09:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి ఉండే కానీ.. అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో కురుమల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ వర్గంలో కురుమ సంఖ్య పెద్దదేనని తెలిపారు. కురుమలకు రాజకీయ అవకాశాలు రావాలన్నారు. గద్వాల్‌లో సరితకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కానీ అక్కడ కొన్ని కారణాల వల్ల ఓటమిపాలయ్యిందని వెల్లడించారు. సరితా గెలిస్తే కురుమలకు మరింత బలం అయ్యేదన్నారు. బీర్ల ఐలయ్య గెలిచి కురుమలకు ప్రతినిధిగా నిలిచిండని తెలిపారు. కురుమలకు కార్పొరేషన్ పదవులు కూడా దక్కాలన్నారు. కురుమ కులానికి చెందిన కొల్లూరు మల్లప్ప మొట్టమొదటి సారిగా హైదరాబాద్ స్టేట్‌కు పీసీసీ చీఫ్‌గా పనిచేశారని పేర్కొన్నారు. ఐలయ్య ఆధ్వర్యంలో సీఎంను కలిసి కురుమలకు పార్టీలు ప్రభుత్వంలో మరిన్ని అవకాశాలు వచ్చేలా చూస్తామని మహేష్ కుమార్ చెప్పుకొచ్చారు.

Similar News