భద్రకాళి దేవస్థానంలో హుండీ లెక్కింపు

వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళీ

Update: 2024-03-28 14:58 GMT

దిశ, వరంగల్ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో గురువారం దేవాదాయ శాఖ కార్యాలయ పరిశీలకులు ఎం.అనిల్ కుమార్ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపులో (రూ.39,33,240) ముప్పది తొమ్మిది లక్షల, ముప్పది మూడు వేల, రెండు వందల నలభై రూపాయలు ఆదాయం సమకురినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అట్టి ఆదాయం దేవాలయ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేశారు. విదేశీ కరెన్సీ 387 అమెరికా డాలర్లు, 30 బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పౌండ్స్, 31 మలేషియా రిఙ్గ్గేట్స్ లభించాయి. హుండీలో వెళ్ళిన వెండి, బంగారం తిరిగి హుండీలో వేశారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సేవ సమితిలోని 100 మంది సభ్యులు, దేవాలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారని కార్యనిర్వహణాధికారి శేషు భారతి తెలిపారు.

Similar News