ఓటింగ్ కు కలెక్టర్ ఆహ్వాన పత్రిక…సోషల్ మీడియాలో వైరల్

ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగం అత్యంత కీలకం. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున ఓటు వేసుకునేలా కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ఓటర్లను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.

Update: 2024-05-09 12:08 GMT

దిశ, కాటారం : ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగం అత్యంత కీలకం. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున ఓటు వేసుకునేలా కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ఓటర్లను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. భారత ప్రజాస్వామ్య పండగ - లోక్సభ సాధారణ ఎన్నికలు 2024 పేరిట జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా వినూత్న రీతిలో ఆహ్వాన పత్రికలు ముద్రించి పంపిణీ చేయడం ఓటర్లను చైతన్య పరచడం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓట్ల పండుగకు మీ కుటుంబంలోని అర్హులైన ఓటర్లందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ముద్రించిన ఆహ్వాన పత్రికలు వైరల్ అవుతున్నాయి.

ఈ వేడుకకు హాజరై ఫలాలను అందుకోవాలని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ ముద్రించిన ఈ ఆహ్వాన పత్రికలు రాష్ట్రంలోనే సరికొత్త సాంప్రదాయానికి తెరలేపాయి. జిల్లా కలెక్టర్ వేడుకకు రావాలంటూ ఆహ్వాన పత్రికలు పంపడానికి అసలు కారణం ఏంటంటే లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఈనెల 13న పోలింగ్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొనాలని ఎంపీని ఎన్నుకోవాలని సూచించారు. పోలింగ్ స్టేషన్లో వేదికగా నిర్వహించే ఓటింగ్ ప్రక్రియకు హాజరైనట్లయితే ప్రభుత్వం అందించే ఫలాలను ప్రజలు అందిపుచ్చుకోవచ్చునని పేర్కొన్నారు. కోట్ల పండుగ వేడుకకు వచ్చే ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డును తమతో తీసుకురావాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భవిష్ మిశ్రా పేరిట తయారైన ఈ ఆహ్వాన పత్రికతో ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నం వినూత్నంగా చేపట్టారు.

అయితే భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి ప్రజాస్వామ్య పండుగకు హాజరుకావాలంటూ ఆహ్వాన పత్రికలు తయారు చేయించి నూతన కొరవడికి స్వీకారం చుట్టారు. చాలామంది శుభకార్యాలు వివాహంతో పాటు ఇతరత్రా కార్యక్రమాలకు ఆహ్వాన పత్రికలు తయారు చేయించి బంధుమిత్రులకు స్నేహితులకు పంపిణీ చేసి పిలుస్తుంటారు. జిల్లాలో మొదటి పౌరుడుగా ఉన్న కలెక్టర్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున ఓటర్లందరి ప్రాతినిధ్యం ఉండేలా ఆహ్వాన పత్రికను ముదిరించి జిల్లా ప్రజలకు అందేలా నూతన పద్దతికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ తీరు చర్చకు దారి తీసింది. పోలింగ్ రోజున ఓటర్లందరూ పాల్గొనేలా ఆహ్వాన పత్రిక ముద్రించి పంపిణీ చేసేలా జిల్లా కలెక్టర్ తీసుకున్న కొత్త తంతాను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ విషయం అంతట వైరల్ అవుతోంది.

Similar News