కరోనాపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు.

Update: 2023-12-18 16:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు వైద్యశాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సోమవారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. కేరళ రాష్ట్రంలో ఈ నెల 8న కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే పండుగల సీజన్‌ దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైన మేరకు మాస్కులను ధరించాలని సూచించారు.

ముందస్తు జాగ్రత్తగా ప్రజారోగ్య శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇతర ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉన్నదని, తగినన్ని వ్యాధినిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని అధికారులకు మంత్రి వివరించారు. పబ్లిక్ ఆందోళన చెందవద్దని, వాతావరణ పరిస్థితులతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నదని, డాక్టర్ల సలహాతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News