వనదేవతలకు మొక్కులు చెల్లించిన డీజీపీ రవి గుప్త.. ట్రాఫిక్ నియంత్రనపై ఫుల్ ఫోకస్

తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్త, అడిషనల్ డీజీపీ ఇంటిలిజెన్స్ బి.శివధర్ రెడ్డిలు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతర సందర్శించి వనదేవతలకు మొక్కులు చెల్లించారు.

Update: 2024-02-19 15:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్త, అడిషనల్ డీజీపీ ఇంటిలిజెన్స్ బి.శివధర్ రెడ్డిలు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతర సందర్శించి వనదేవతలకు మొక్కులు చెల్లించారు. అనంతరం నోడల్ అధికారుల సమావేశంలో వారు పాల్గొన్నారు. జాతర సందర్భంగా డీజీపీ రవి గుప్తా మాట్లాడుతూ.. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతర సమ్మక్క సారలమ్మ జాతర అని అన్నారు. ఈ జాతరకు రెండు కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని, రాబోవు నాలుగు రోజులు జాతర నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. సిబ్బందికి డ్యూటీ పాయింట్ల వద్ద సరైన అవగాహన కల్పించాలని తెలియజేశారు.

ట్రాఫిక్ నియంత్రనపై ఫుల్ ఫోకస్

ముఖ్యంగా ట్రాఫిక్ నిర్వహణ జాతర నిర్వహణలో ప్రథమ స్థానం కలిగి ఉంటుందని, దానికి అనుగుణంగా సిబ్బందిని కేటాయించి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రింది స్థాయి సిబ్బందికి అధికారులు అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ ఇంటెలిజెన్స్ బి.శివధర్ రెడ్డి, ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి, ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం, తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News