MLC కవితకు సీబీఐ నోటీసులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు అని మరోసరి బహిర్గం అయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు

Update: 2022-12-03 11:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు అని మరోసరి బహిర్గం అయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు సీబీఐ అందరినీ ఢిల్లీకి పిలించిందని, కవిత విచారణకు మాత్రం ఆపవ్షన్లు, అనుమతి కోరుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని అన్నారు. కేసీఆర్ ఆవినీతి చిట్టా బయటపెట్టాలంటే చాలా ఉన్నాయని, కోకాపేట భూములు, ఇతర కేసులపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. గతంలో ఈసీకి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదని ఢిల్లీలో ఐదు రోజులు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదని అన్నారు. డిసెంబర్ 6లోపు స్పందించకపోతే ఢిల్లీ హైకోర్టు తీర్పు చెల్లకుండా పోతుందని అన్నారు. తెలంగాణలోన బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోందని ఈ వ్యవహారానంతటిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

Tags:    

Similar News