ఎట్టకేలకు కటకటాల్లోకి వడ్డీ వ్యాపారి

ఆటో డ్రైవర్ ను చిత్రహింసలకు గురిచేసి దాడికి పాల్పడిన వడ్డీ వ్యాపారి ఎట్టకేలకు కటకటాల్లోకి వెళ్లాడు.

Update: 2024-03-28 15:08 GMT

దిశ,తాండూరు : ఆటో డ్రైవర్ ను చిత్రహింసలకు గురిచేసి దాడికి పాల్పడిన వడ్డీ వ్యాపారి ఎట్టకేలకు కటకటాల్లోకి వెళ్లాడు. పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నేరస్తుడైన మ్యాతరి రవి వ్యాపారం చేస్తున్నాడు. తాండూర్ పట్టణం గాంధీనగర్ కు చెందిన ఈ వ్యక్తి వడ్డీ పేరుతో ఆటో డ్రైవర్ను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా పోలీసుల ఆదేశాలను సైతం లెక్కచేయక తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితుడు ఆటో డ్రైవర్ బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిపై సలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే నిందితుడు పోలీసుల దర్యాప్తునకు సహకరించకుండా తప్పించుకు తిరగడంతో గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాను వాడుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.  

Similar News