YS షర్మిలకు Prime Minister Narendra Modi ఫోన్

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కిన వేళ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు.

Update: 2022-12-06 06:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కిన వేళ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న తాజా పరిణామాలపై మోడీ ఆమెతో చర్చించారు. దాదాపు 10 నిమిషాల పాటు షర్మిలతో మాట్లాడారు. అంతేగాక, షర్మిలను ఢిల్లీకి రావాలని మోడీ సూచించారు. ఆమె పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించిన తీరుకు సానుభూతి వ్యక్తం చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా కారులో ఉండగానే స్టేషన్‌కు తీసుకెళ్లడం అనేది దారుణం అని.. దీనిని మోడీ తీవ్రంగా ఖండించినట్లు సమాచారం. ఘటనను చూసి తాను చాలా ఫీల్ అయినట్లు తెలిపారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని షర్మిలతో మోడీ మాట్లాడినట్లు సమాచారం. మరోవైపు, నిన్న జరిగిన జీ20 సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ వద్ద షర్మిల ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఇటువంటి ఘటనలు మరోసారి రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం ఉందని షర్మిలతో మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా షర్మిల ఓసారి ఢిల్లీకి వచ్చి కలవాల్సిందిగా మోడీ ఆహ్వానించినట్లు సమాచారం.

Read more:

'శ్రీకాంతాచారి అమరుడైతే.. హరీష్ మంత్రి అయ్యాడు'

Tags:    

Similar News