యువతులతో అసభ్యకర నృత్యాలు.. 167 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ మహానగరంలో పబ్ కల్చర్ రోజు రోజుకు పెరిగిపోతుంది. రాత్రి అయ్యిందంటే చాలు హైటెక్ సిటీ, బంజరాహిల్స్ ప్రాంతాల్లో పబ్ల మోత మోగిపోతుంది.
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహానగరంలో పబ్ కల్చర్ రోజు రోజుకు పెరిగిపోతుంది. రాత్రి అయ్యిందంటే చాలు హైటెక్ సిటీ, బంజరాహిల్స్ ప్రాంతాల్లో పబ్ల మోత మోగిపోతుంది. వందల సంఖ్యలో పబ్లను నిర్వహిస్తున్న ఇందులో కొన్నింటికి మాత్రమే పర్మిషన్ ఉన్నాయి. అయితే ఇందులోను కొన్ని పబ్లు అసాంఘిక కార్యకలాపాలు, నిబంధనలకు విరుద్దంగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఉన్నతాధికారులు నిత్యం చెకింగ్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో,, ఆఫ్టర్ నైన్ క్లబ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా ఇతర రాష్ట్రాల యువతులతో ఫబ్ లో అసభ్యకరమైన నృత్యాలు చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ సమయంలో ఫబ్ లో ఉన్న 167 మందిని అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు పబ్ పై కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో మొత్తం 35 మంది యువతులు, 75 మంది యువకులు ఉన్నారు. కాగా వీరందరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.