పరమత సహనం శాంతికి మూలం.. హెచ్ఐసీసీలో పీస్ సింపోనియం 2022

పరమత సహనమే ప్రపంచ శాంతికి మూలమని, అన్ని మతాల సారం ఒక్కటేనని తెలుగు యూనివర్సిటీ వీసి తంగెడ కిషన్ రావు అన్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లోని హెచ్ ఐసీసీలో అహ్మదీయ కమ్యూనిటీ ఆధ్వర్యంలో

Update: 2022-09-25 16:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పరమత సహనమే ప్రపంచ శాంతికి మూలమని, అన్ని మతాల సారం ఒక్కటేనని తెలుగు యూనివర్సిటీ వీసి తంగెడ కిషన్ రావు అన్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లోని హెచ్ ఐసీసీలో అహ్మదీయ కమ్యూనిటీ ఆధ్వర్యంలో 'నిజమైన, సుస్థిర ప్రపంచశాంతి' అనే అంశంపై శాంతి సమ్మేళనం (పీస్ సింపోనియం)ను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రావు మాట్లాడుతూ..శాంతిని ప్రబోధించి, సోదరభావాన్ని పెంపొందించడమే అన్ని మతాల కర్తవ్యమని అన్నారు. శాంతి ఆవశ్యకతను తెలిపేందుకు సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు. దీనిని గ్రామీణ స్థాయి నుంచి విశ్వ వ్యాప్తం చేయాలని సూచించారు.

అనంతరం అహ్మదీయ కమ్యూనిటీ జాతీయ ప్రతినిధి హుసాం అహ్మద్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్‌ల యుద్దం, తైవాన్, చైనాల మధ్య వైరుధ్యాలతో సంక్షోభంలో ఉన్న మానవాళిని శాంతి వైపు నడిపించడమే తమ కర్తవ్యమని చెప్పారు. నేటి సమాజానికి, భావి తరాలకు మానవత్వం, విలువలను నేర్పుదామని పద్మశ్రీ గ్రహీత డాక్టర్ సాయిబాబా గౌడ్ అన్నారు. కాగా హాలీవుడ్ డైరెక్టర్ ప్రిన్స్ జగదీష్​ మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చరిత్రను కథాంశంగా తీసుకుని సినిమా నిర్మించతలపెట్టామని తెలిపారు. అనంతరం వివిధ మతాల పెద్దలు, విద్యావేత్తలు, మేధావులు, న్యాయవాదులు, రక్షణ, వైద్య రంగ నిపుణులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేఎన్ టీయూ డైరెక్టర్ గోవర్ధన్, ఎంఎస్ మేఘన పాల్గొన్నారు.

Similar News