విద్యార్థుల విషయంలో రాజకీయం వద్దు : Minister Sabitha Indra Reddy

పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో లీక్‌ ప్రచారం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన విడుదల చేశారు. పదవతరగతి పరీక్షల విషయంలో జిల్లా కలెక్టర్లు

Update: 2023-04-04 09:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో లీక్‌ ప్రచారం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన విడుదల చేశారు. పదవతరగతి పరీక్షల విషయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్ డిపార్ట్మెంట్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 4.95 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా పనిచేయాలని సూచించారు. మొదటిసారి బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న చిన్నారులను గందరగోళ పరిస్థితులకు గురిచేయడానికి ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి సబితా హెచ్చరించారు. విద్యార్థుల విషయంలో రాజకీయ స్వార్థం, వ్యక్తిగత స్వార్థం పక్కనపెట్టిలని కోరుతూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ విడుదల చేశారు.

Tags:    

Similar News