ఎమ్మెల్సీ కవిత నివాసంలో సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు ఎమ్మెల్సీ కవిత....Sankranti Celebrations at MLA Kavitha house

Update: 2023-01-15 06:52 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు ఎమ్మెల్సీ కవిత. ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలోని వాకిట్లో గొబ్బెమ్మలు, హరివిల్లును తలపించే రంగురంగుల ముగ్గులతో ప్రత్యేక శోభను సంతరించుకుంది. ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి, సంక్రాంతి వేడుకల్లో పాలుపంచుకున్నారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం పాడిపంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న ఎమ్మెల్సీ కవిత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.





Tags:    

Similar News