ఆకునూరి మురళి ప్రసంగాన్ని అడ్డుకున్న వాకర్స్.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు

జాగో తెలంగాణ ఫోరం, టీఎస్‌డీఎఫ్ ఆధ్వర్యంలో విద్వేష విభజన, నియంతృత్వం, అప్రజీర స్వామిక రాజకీయాలను చేస్తున్న వారిని ఓడించండంటూ రిటైర్డ్ ఐఏఎస్ అకునూరి మురళి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించారు.

Update: 2024-05-03 06:53 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జాగో తెలంగాణ ఫోరం, టీఎస్‌డీఎఫ్ ఆధ్వర్యంలో విద్వేష విభజన, నియంతృత్వం, అప్రజీర స్వామిక రాజకీయాలను చేస్తున్న వారిని ఓడించండంటూ రిటైర్డ్ ఐఏఎస్ అకునూరి మురళి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఐటీఐ‌ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండగా అక్కడున్న వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు.

వాకర్స్‌కు టీఎస్‌డీఎఫ్ నేతలకు మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వాకర్స్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా టీఎస్‌డీఎఫ్ ప్రతినిధులు కూడా బీజేపీ డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ ప్రధాని స్థాయి వ్యక్తి తన హోదాను మరిచి విద్వేషాలు రగిలించేలా ప్రసంగాలు చేయడం దారుణం అని అన్నారు. కార్పొరేట్ వ్యక్తులకు అనుగుణంగా రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దేశంలో నల్లధనం వెలికి తీస్తామని అధికారంలోకి వచ్చి ఒక్క రూపాయి బయటకు తీసుకురాలేకపోయారని ఆరోపించారు.

దేశంలో పేదరికం పెరిగిపోయి చాలా మందికి కనీసం తినడానికి తిండి కూడా లేక అలమటిస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ విద్య, వైద్యం అందడం లేదని వాపోయారు. దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం రాజకీయమా అని ప్రశ్నించారు. ఏ పార్టీ అయినా తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పాలని.. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేశామో చెప్పి ఓట్లు అడగాలని, మత విద్వేశాలు రగిల్చి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, ఆకుల భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News