ప్రతి కూలీకి బ్యాంక్ ఖాతాలో సంవత్సరానికి రూ. 40వేలు వేస్తాం: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈ దఫా ఎన్నికల్లో నిలబడ్డానని, పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరూ నన్ను ఆదరించి, అండగా నిలిచి ఎంపీగా గెలిపించండని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటి పత్రి జీవన్ రెడ్డి అన్నారు.

Update: 2024-05-03 08:12 GMT

దిశ, ఆర్మూర్: నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈ దఫా ఎన్నికల్లో నిలబడ్డానని, పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరూ నన్ను ఆదరించి, అండగా నిలిచి ఎంపీగా గెలిపించండని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటి పత్రి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి, ఆర్మూర్ నియోజక వర్గ ఇంఛార్జి వినయ్ కుమార్ రెడ్డి తో కలిసి ఆర్మూర్ నియోజకవర్గం ఆర్మూర్ మండలంలోని గోవింద్ పెట్, చేపుర్, పిప్రీ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో వేర్వేరుగా శుక్రవారం సమావేశం అయ్యారు. కూలీలను ఆప్యాయంగా పలుకరిస్తూ.. ఆత్మీయంగా మాట్లాడారు. వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అండగా నిలువాలని.. ఎంపిగా గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను జీవన్ రెడ్డి అభ్యర్థించారు. ఉపాధి కూలీల రోజు వారి వేతనం 400 లకు పెంచుతామని హామీ ఇచ్చారు.

గ్రామం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్‌కు ఓటేస్తెనే సాధ్యం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు మంజూరు చేశారని, త్వరలోనే ఇళ్లు లేని నిరుపేదలు ఇళ్లు మంజూరు చేసుకుందామన్నారు. మహిళలపై భారం పడకుండా సిలిండర్ ను రూపాయలు 500 కి అందిస్తున్నాం. మహిళల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించాం. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలని, గ్రామాల్లో ఏ అభివృద్ధి జరగాలన్న రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. రేషన్ కార్డు రావాలన్నా, పెన్షన్ కావాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్య అవుతుందన్నారు.

ఇల్లు లేని నిరుపేదలందరికీ ఒక్కొక్కరికి ఐదు లక్షల మంజూరు చేస్తాం. దళితులకు అదనంగా మరో లక్ష అందిస్తాం. ఇంటింటా తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని కాంగ్రెస్ కార్యకర్తలు పరిశీలించి అర్హులందరికీ పథకాలు అందించాలని జీవన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. గ్రామీణ నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో సోనియా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించారు.

అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం ప్రారంభిస్తే బీజేపీ ప్రభుత్వం కూలీలకు చెల్లించే వేతనంలో కోతలు పెడుతోంది. ప్రతి కుటుంబానికి ఏడాదికి వంద రోజులు పనులు కల్పించాలనే నియమాన్ని బీజేపీ ప్రభుత్వం తుంగలోతోక్కి పని దినాలు తగ్గించింది. ఏటా ఉపాధి హామీ పథకం నిధులు పెంచాల్సి ఉండగా, నిధులు తగ్గిస్తూ నిర్వీర్యం చేస్తున్నారు. మరోసారి బిజెపి అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. ప్రజలు బీజేపీ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని మహిళలను వేడుకొన్నారు. పనిచేసే చోట మౌలిక వసతులు.. ఉపాధి కూలీలను తరలించేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తాం. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పని కల్పిస్తాం. గతంలో రుణమాఫీ చేసినమన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి 2 లక్షలు మాఫీ చేస్తాం. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు పదేళ్లుగా భర్తీ చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తాం. వేసవిలో కులీలకు 35 శాతం అదనంగా బోనస్ చెల్లిస్తాం. ప్రతి ఉపాధి హామీ కూలికి రోజువారి వేతనం 400 అందిస్తామని భరోసానిచ్చారు.

బీజేపీ కుట్రలు ఇకపై కొనసాగవు. ఆడ బిడ్డలు కాంగ్రెస్ వెంటే ఉన్నారు. ప్రతి ఉపాధి హామీ కూలికి ఏటా రూ. 40 వేలు ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఓటేసి, ఎంపీ గా గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను జీవన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, మాజీ జడ్పీ చైర్మన్ గంట సదానందం, మాజీ సర్పంచులు పిప్రి జీవన్ రెడ్డి, బండమీది జమున గంగాధర్, ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్కే చిన్నారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ నాయకులు యల్ల సాయి రెడ్డి, మంథని పుట్టింటి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Similar News