రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ…

పట్టపగలే ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం జరిగింది.

Update: 2024-04-16 13:06 GMT

దిశ, భువనగిరి రూరల్: పట్టపగలే ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం జరిగింది. ఈ సంఘటన సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రాయిగిరి గ్రామంలో మధ్యాహ్న సమయంలో బట్టు రాజు ఇంటికి వేసి ఉన్న తాళం ను పగలగొట్టి ఐదు వేల నగదును దొంగిలించిన కేటుగాడు… పక్కనే ఉన్న మరొక ఇంటి తాళం పగలగొడుతుండగా గమనించిన బొజ్జ బిక్షపతి ద్వారా సమాచారం తెలుసుకున్న స్థానిక యువత, మహిళలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. పట్టుకున్న దొంగ భువనగిరిలోని సంజీవనగర్ కాలనీకి చెందినట్లుగా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News