సమాచార హక్కు చట్టాన్ని కాంగ్రెస్ పార్టే అందుబాటులోకి తెచ్చింది : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

సమాచార హక్కు చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-05-02 09:39 GMT

దిశ,చౌటుప్పల్: సమాచార హక్కు చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సమాచార హక్కు చట్టం సంబంధించిన అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు.

ఈ చట్టాన్ని కాపాడాలని మార్గదర్శకంతో ప్రభుత్వం నడవాలని, మీరందరూ ఒక సమిష్టిగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు అన్నారు. గత పది సంవత్సరాలుగా భారతదేశంలో గానీ మన రాష్ట్రంలో చీకటి జీవోలను తీసుకురావడం జరిగిందని, తీసుకొచ్చిన జీవోలు ప్రజలకు తెలియకుండా అధికారాన్ని చలాయించి లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలపై మోపారని విమర్శించారు. సమాజం కోసం మంచి చేయాలని ఆలోచనతో ఈ కార్యక్రమాలను చేస్తున్నందుకు ఆర్టిఐ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.

స్వచ్ఛందంగా ప్రజలకు మంచి జరగాలని మార్గదర్శకంగా ప్రభుత్వాలు పనిచేయాలని ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉండకుండా ప్రజలు అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలని తెలిపారు. ప్రతి జీవోను కూడా ప్రజలకు తెలియజేసే విధంగా, వాస్తవాలను తెలిసే విధంగా ఉండాలని, గతంలో కాంగ్రెస్ పార్టీ సమాచార హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార చైర్మన్ డా.వర్రె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Similar News