యూపీఎస్సీ ఫలితాల్లో నాంపల్లి ఆడబిడ్డకు 112 వ ర్యాంకు

ఇటీవల యూపీఎస్సీ ఫలితాల్లో నాంపల్లి మండలం మెల్లవాయి గ్రామానికి చెందిన గాడిపర్తి దర్శిని కి 112 వ ర్యాంకు వరించింది.

Update: 2024-04-19 15:30 GMT

దిశ ,మర్రిగూడ: ఇటీవల యూపీఎస్సీ ఫలితాల్లో నాంపల్లి మండలం మెల్లవాయి గ్రామానికి చెందిన గాడిపర్తి దర్శిని కి 112 వ ర్యాంకు వరించింది. గాడిపర్తి గిరిధర్ నవదీపికమ్మల కుమార్తె దర్శిని, దర్శిని తల్లి నవదీపికమ్మ హైకోర్టు క్రిమినల్ లాయర్ గా పనిచేస్తుంది. దర్శిని రైల్వే శాఖలో ఉన్నత ఉద్యోగం లో చేరి ఇటీవలనే రిజైన్ చేసి ఐఏఎస్ కు ప్రిపేర్ అయింది. మొదటి ప్రయత్నంలోనే 112 వ ర్యాంకు రావడం తో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు . మండలంలో కుగ్రామమైన మేళ్లవాయి గ్రామానికి చెందిన ఆడబిడ్డకు ఐఏఎస్ ర్యాంకు రావడంతో మండల ప్రజలు దర్శిని అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం దర్శిని కుటుంబం హైదరాబాదులోని హయత్ నగర్ లో నివాసం ఉంటుంది.

Similar News