ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న గీత కార్మికుడు

తాటి చెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారి తాడు పైనే ఉండిపోయిన గీత కార్మికుడు ప్రాణాపాయం నుంచి బయటపడిన సంఘటన మండలంలోని ముసి పట్ల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.

Update: 2024-05-17 14:37 GMT

దిశ,మోత్కూరు: తాటి చెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారి తాడు పైనే ఉండిపోయిన గీత కార్మికుడు ప్రాణాపాయం నుంచి బయటపడిన సంఘటన మండలంలోని ముసి పట్ల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎరుకల పాపయ్య (60) ఎర్ర చలక కింద ఉన్న తాటి చెట్టు ఎక్కేందుకు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. స్థానిక రైతులు చూసి వెంటనే అందుబాటులో ఉన్న జేసీబీకి సమాచారం ఇచ్చారు. జేసీబీ సహాయంతో ప్రాణాపాయం నుంచి రక్షించారు. దీంతో కుటుంబ సభ్యులు సహాయం పడిన రైతులకు, జేసీబీ డ్రైవర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News