ఎన్నికల హామీలను అమలు చేయండి..హోంమంత్రికి వినతి

గత ఎన్నికల సందర్భంగా ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీకీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అతహర్ తోటి సభ్యులతో కలిసి వినతి పత్రం సమర్పించారు.

Update: 2022-12-08 14:23 GMT

దిశ, యాదాద్రి కలెక్టరేట్/భువనగిరి రూరల్: గత ఎన్నికల సందర్భంగా ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీకీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అతహర్ తోటి సభ్యులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. గురువారం మహమూద్ అలీ ఉర్సు ఉత్సవాలకు విచ్చేసిన సందర్భంగా ఆయనను కలిసి మైనారిటీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 శాతం రిజర్వేషన్, వాక్ఫ్ బోర్డుకు జ్యూడిషల్ పవర్ లను అమలు చేయాలని, ప్రస్తుతం బీసీ ఈ కేటగిరిలో ఉన్న 4 శాతం రిజర్వేషన్ 3 శాతానికి తగ్గిస్తున్నారని వస్తున్న వార్తలపై వివరణ కోరడం జరిగిందని అతహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షకీల్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు రమేష్, పట్టణ అధ్యక్షుడు సాయి నివాస్, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు వాహేద్, రఫీ గౌరి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రావుల రాజు, బట్టు రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Similar News