తెలంగాణలో బీఆర్ఎస్ ను బతకనివ్వం

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బతకనివ్వమని, బొంద పెడతామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Update: 2024-05-01 15:08 GMT

దిశ, రాజాపేట :  తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బతకనివ్వమని, బొంద పెడతామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ప్రచారంలో భాగంగా బుధవారం రాజాపేట గాంధీ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పదేళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చేర్చుకున్నప్పుడే శపథం చేశానని, కేసీఆర్ అహంకారంను అణచివేసేందుకు ఉద్యమించానన్నారు. హరీష్ రావుకు రోజులు దగ్గర పడ్డాయని, కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. భువనగిరి ఎంపీ నియోజకవర్గంలో 46 మండలాలు ఉన్నాయని, రాజాపేట లో

     భారీ మెజారిటీ ఇస్తే ముఖ్యమంత్రి దగ్గర కూర్చుని 100 కోట్లు ఆలేరు నియోజకవర్గం అభివృద్ధికి తెస్తానని అన్నారు. రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి తో పంచ పాండవులము కలిశామని రాహుల్ గాంధీని ప్రధాన్ని చేయడం ఖాయమన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొని తీసుకువస్తానని ముఖ్యమంత్రికి మాట ఇచ్చాను అని అన్నారు. గతంలో నాకు, వెంకట్ రెడ్డికి ఇచ్చిన మెజారిటీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ 150 రోజుల్లో 120 కోట్ల నిధులు తీసుకోవచ్చానని అన్నారు. గంధమల్ల 1.5 టీఎంసీలతో మినీ ట్యాంక్ బండ్ గా గంధ మల్ల ఊరు పోకుండా, భూములు కోల్పోకుండా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి అన్నారు. కార్యక్రమంలో సంజీవరెడ్డి, జనగాం ఉపేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నీలం పద్మ, మహేందర్ గౌడ్,పెంటయ్య, నరేష్, కేదార్ గౌడ్ పాల్గొన్నారు. 

Similar News