16 ఎంపీ స్థానాల్లో బీఆర్​ఎస్ దే విజయం

తెలంగాణకు శాశ్వత హీరో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని, 16 ఎంపీ స్థానాల్లో గెలుపొందుతామని, కొన్ని స్థానాల్లో రెండో స్థానంలోనైనా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.

Update: 2024-04-30 13:14 GMT

దిశ,చండూరు : తెలంగాణకు శాశ్వత హీరో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని, 16 ఎంపీ స్థానాల్లో గెలుపొందుతామని, కొన్ని స్థానాల్లో రెండో స్థానంలోనైనా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. పార్టీని వీడిన వారితో ఎలాంటి నష్టం లేదని, వారు ఉండగానే గతంలో ఓడిపోయామని అన్నారు. అలాంటి వారితో ఎలాంటి ప్రయోజనం లేదని, వారిని చూసి ఆగమాగం అవ్వద్దు అని అన్నారు. చండూరులో మంగళవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఫెయిల్ అయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీనే అని, పోలీసులను అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే వాడుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ బయటికి వచ్చి గర్జించడంతో అందరి నోర్లు సన్నబడ్డాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. తెలంగాణను బతికించేది కాలేశ్వరం ప్రాజెక్టు అని, కుంగిపోయిన పిల్లర్లకు సంబంధం లేదని అన్నారు.

     ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ మాట్లాడుతూ కార్యకర్తలకు అన్నివేళలా తాను అండగా ఉంటానని తెలిపారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే సత్తా ఒక్క బీఆర్ఎస్ కే ఉందన్నారు. చండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ ఎన్నికల నియోజవర్గ కోఆర్డినేటర్, సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్, రాష్ట్ర నాయకురాలు పాల్వయి స్రవంతి రెడ్డి, మునగాల నారాయణరావు, గుర్రం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఎంపీపీ అవ్వారి గీత శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ కోడి సుష్మా వెంకన్న, కౌన్సిలర్లు అన్నపర్తి శేఖర్, చిలుకూరి రాధిక శ్రీనివాస్, మంచుకొండ కీర్తి సంజయ్, చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షుడు పులిపాటి ప్రసన్న, బీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు ఉజ్జిని అనిల్ రావ్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు కురుపాటి సుదర్శన్, మాజీ మండల అధ్యక్షుడు పెద్దగాని వెంకన్న, అధికార ప్రతినిధి బొడ్డు సతీష్, భూతరాజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.  

Similar News