ఈ నెల 21న కేసీఆర్ బాగోతం బట్టబయలు.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

మునుగోడులో ఈనెల 21న అమిత్ షా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు నెల క్రితమే ప్రకటించామని.. ఆ సభను గందరగోళం చేయడానికి సీఎం కేసీఆర్

Update: 2022-08-19 14:51 GMT

దిశ, మునుగోడు: మునుగోడులో ఈనెల 21న అమిత్ షా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు నెల క్రితమే ప్రకటించామని.. ఆ సభను గందరగోళం చేయడానికి సీఎం కేసీఆర్ దురబుద్ధితో ఒక్కరోజు ముందుగా వారి సభను ఏర్పాటు చేయడం దారుణమని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబమే బాగుపడింది తప్ప.. ప్రజలు బాగుపడలేదన్నారు. మల్లన్న ప్రాజెక్ట్ బాధితులకు ఎకరానికి 15 లక్షలు ఇచ్చారని, వారికి గజ్వేల్‌లో ఇల్లు కూడా కట్టిస్తున్నారని తెలిపారు.

మునుగోడు నియోజకవర్గంలోని చర్లగూడెం బాధితులకు ఎందుకు నష్టపరిహరం ఇవ్వడంలేదని, వారి పట్ల కేసీఆర్ వివక్షత చూపడం సరికాదని విమర్శించారు. నష్టపరిహారం ఇవ్వాలని ప్రశ్నిస్తున్న మహిళలపై దాడి చేస్తూ.. ప్రాజెక్టు పనులు కొనసాగించడం హిట్లర్ పాలనకు నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేసేందుకే అమిత్ షా సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌ను నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వారికి ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారన్నారు. రాష్ట్రంలో కుటుంబ నియంత పాలన నడుస్తుందన్నారు.

Similar News