రాష్ట్రంలో 'మంకీ ఫాక్స్' అలెర్ట్.. విదేశీయులపై నిఘా..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మంకీ ఫాక్స్ అలర్ట్ జారీ అయింది. ఇతర దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మంకీ ఫాక్స్ అలర్ట్ జారీ అయింది. ఇతర దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శరీరంపై దద్దుర్లు, పుండ్లు వంటివి ఉంటే వెంటనే వైద్యారోగ్యశాఖకు సమాచారం ఇవ్వాలని సర్కార్ కోరింది. వెంటనే క్వారంటైన్కావాలని స్పష్టం చేసింది. అంతేగాక ఇతర దేశాల నుంచి వచ్చినోళ్లపై నిఘా పెట్టాలని జిల్లా వైద్యాధికారులకు హెల్త్ డిపార్ట్మెంట్ఆదేశాలు ఇచ్చింది. అయితే మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నోళ్ల శాంపిళ్లను పూణే వైరాలజీ ల్యాబ్‌కు పంపించాలని ఆఫీసర్లు నిర్ణయించారు.
ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ డీఎమ్‌హెచ్‌ఓలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం నొక్కి చెప్పింది. ఇప్పటికే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ల గాలింపు చర్యలు చేపట్టారు. ఎయిర్‌పోర్టు అధికారులు, వైద్యశాఖ, మున్సిపల్ ఆఫీసర్లు సమన్వయమై ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మరోవైపు మంకీ ఫాక్స్సోకిన వారికి ఎక్కువగా జ్వరం, ఒళ్లు నొప్పులు, చలి, అలసట వంటి లక్షణాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ముఖం, చేతులపై దద్దుర్లు, చిన్న బొబ్బలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.