కల్లబొల్లి మాటలు, అమలు కాని హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది

కల్లబొల్లి మాటలు చెప్పి అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-05 11:10 GMT

దిశ, సదాశివపేట : కల్లబొల్లి మాటలు చెప్పి అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా సదాశివపేట మండలం ఇశ్రుతాబాద్ గ్రామంలో ఆదివారం ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. బ్యాలెట్ నమూనాతో ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఎలా ఓటు వేయాలో అవగాహన కల్పించి, కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయిందని..

     కష్టాలు వచ్చాయని ,సంక్షేమ ఫలాలు రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మౌజములకు, ఇమామ్లకు గౌరవ వేతనం ఇచ్చి ఆదుకున్నాం అని, కాంగ్రెస్ ప్రభుత్వం మౌజములకు, ఇమామ్లకు రూ. 12 వేలు ఇస్తామని చెప్పి రూ.5 వేలు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ అబద్ధాల కాంగ్రెస్ పై పోరాటం చేయాలంటే ఎంపీ కూడా నాకు తోడై ఉండాలని..బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. గ్రామం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో నాకు మెజారిటీ ఇచ్చారని ..అదే విధంగా ఎంపీ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డికి మెజారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ కాసాల బుచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, ఎంపీపీ యాదమ్మ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్​రెడ్డి , తాజామాజీ సర్పంచ్ లు రాములు, లక్ష్మారెడ్డి, బాబు మీయ, , మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, గ్రామ యువకులు ,ప్రజలు పాల్గొన్నారు.

Similar News