గణేష్ గడ్డ మహా గణపతి దేవస్థానం హుండీ లెక్కింపు...

పటాన్ చెరు మండలం రుద్రారంలోని గణేష్ గడ్డ శ్రీ మహా గణపతి దేవాలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు.

Update: 2024-05-17 14:51 GMT

దిశ, పటాన్ చెరు : పటాన్ చెరు మండలం రుద్రారంలోని గణేష్ గడ్డ శ్రీ మహా గణపతి దేవాలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. 61 రోజుల్లో భక్తుల నుంచి కానుకగా రూ.14,03,425 హుండీ ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్ వెల్లడించారు. అన్నదానం హుండీ ఆదాయం రూ.1,01,466/- వచ్చినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ పెద్ద ఎత్తున విరాళాలు అందించిన భక్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ ఈవో మోహన్ రెడ్డి తో పాటు అర్చక బృందం, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Similar News