Manjeera Project : గణపురం ఆనకట్ట వద్ద పొంగిపొర్లుతున్న మంజీరా..

గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ఏకైక మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు అయిన గణపురం ఆనకట్ట వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్నది.

Update: 2023-07-27 13:38 GMT

దిశ, కొల్చారం : గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ఏకైక మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు అయిన గణపురం ఆనకట్ట వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఆనకట్ట పై భాగంలో సుమారు మూడు అడుగుల ఎత్తులో మంజీరా నది ప్రవహిస్తున్నది. రెండు రోజుల్లో కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు కుంటలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని అలుగు పారుతుండడంతో వాగులు వంకలు నీటితో నిండిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొల్చారం ఎస్సై శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

గురువారం తన సిబ్బందితో కలిసి మంజీరా తీరప్రాంతాలను పోతంశెట్టిపల్లి కొంగోడు శివారులలో రోడ్లపై నుండి వెళుతున్న వాగుల వద్ద ప్రమాద సూచికలను ఏర్పాటు చేశారు. ప్రజలు సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. ప్రాజెక్టు మంజీరా ఎక్కువ భాగంలో కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజల ప్రముత్తంగా ఉండాలని అన్నారు. ఏదైనా అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ 100కు డయల్ చేసి పోలీసుల సహాయం పొందాలని ప్రజలకు సూచించారు.

Tags:    

Similar News