కుర్మలు అంటే సీఎం కేసీఆర్ కు గౌరవం: మంత్రి హరీష్ రావు

తెలంగాణ జాతి సంపద సృష్టిస్తున్న కుర్మలు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గౌరవమని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

Update: 2023-03-30 14:15 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: తెలంగాణ జాతి సంపద సృష్టిస్తున్న కుర్మలు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గౌరవమని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో గురువారం భీరప్ప కళ్యాణ మహోత్సవానికి మంత్రి హరీష్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే పది రోజుల్లో రెండవ విడత గొర్రెల పంపిణీ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇర్కోడ్ కు త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించనున్నట్లు తెలిపారు.

అదే విధంగా సిద్దిపేట నుంచి ఇర్కోడ్ వరకు బట్టర్ ఫ్లై లైట్లతో ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అందించిన స్టీల్ బ్యాంక్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ శ్రీ రవీందర్ రెడ్డి, రీజినల్ మేనేజర్ పలుగుల సత్యం, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ డి.సత్యజిత్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ లో చేరికలు..

సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ మామిడి పల్లి యాదగిరి తో పాటు రవి, పోషయ్య, బీజేపీ యూత్ నాయకులు లింగస్వామిలు మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు మంత్రి హరీశ్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గడ్డమీది యాదగిరి, ఎం రాజు, ఎం శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మల్లేశం, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News