గాంధీనగర్ లో తీవ్ర మంచినీటి కొరత

గత వారం రోజుల నుండి చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో మంచినీరు రాక ప్రజలు తీవ్ర ఆందోళన గురై మంగళవారం మెదక్ చేగుంట రహదారిపై కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.

Update: 2024-04-30 10:40 GMT

దిశ, చిన్నశంకరంపేట : గత వారం రోజుల నుండి చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో మంచినీరు రాక ప్రజలు తీవ్ర ఆందోళన గురై మంగళవారం మెదక్ చేగుంట రహదారిపై కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమకు ఉదయం అందించే తాగునీరు పంపు ఆపరేటర్ నిర్లక్ష్యం వల్ల రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజులకోసారి నీళ్లు రావడంతో తీవ్ర ఇబ్బంది అవుతుందని తెలిపారు.

    అధికారులకు కాలనీవాసులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని వారు వాపోతున్నారు. గత మండల సమావేశంలో ఈ విషయమై సభ దృష్టికి సభ్యులు తీసుకపోతే సమస్యను పరిష్కరిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. పలుసార్లు గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్లు లీకేజీ కావడంతో ఇబ్బంది అయినట్టు తెలిపారు. ఈ విషయమై పంచాయతీ ఈఓ సంతోష్ కుమార్ ను వివరణ కోరగా వాటర్ ట్యాంకు నింపుతున్నామని, కరెంటు సరిగా లేనందున మంగళవారం నీటి ట్యాంకర్లతో నీరు సరఫరా చేసినట్టు తెలిపారు. 


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News