నిరుద్యోగ విద్యార్థులకు పరిశ్రమల ద్వారా ఉద్యోగాలకు ఇస్తాం : నీలం మధు

మీబిడ్డగా దీవించి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని

Update: 2024-04-29 15:16 GMT

దిశ,ములుగు : మీబిడ్డగా దీవించి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలోని మర్కుక్, ఎర్రవల్లి, పాములపర్తి గ్రామాలలో సోమవారం రాత్రి రోడ్ షో ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. రైతుల భూములు గుంజుకొని ప్రాజెక్టులు కట్టుకొని డబ్బులను ఫార్మ్ హౌస్ లో పెట్టుకున్నాడు అన్నారు. మర్కుక్ మండల కేంద్రంలోనే ఉంటూ ఒకరి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి య్య లేదన్నారు. నాలుగు నెలలు గడుస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కైనా ఎమ్మెల్యేగా వచ్చాడా అని ప్రశ్నించాడు. ముఖ్యమంత్రి అయినా తర్వాత రేవంత్ రెడ్డి ఆరు హామీలల్లో నాలుగు హామీలుఅమలు చేశారన్నారు. ఈ పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ తప్ప దోచుకునే పార్టీ కాదన్నారు.

బీజేపీ ,బీఆర్ఎస్ లకు ఓట్లేస్తే రెండు ఒకటేనని అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని బిజెపి బీఆర్ఎస్ లు ప్రశ్నిస్తున్నాయని, గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆయా పార్టీలు ఏం చేశాయో? చూపాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయంలోనే పేదలకు ఇండ్లు, భూములు కేటాయించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ఐదు గ్యారెంటీల అమలుతో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. తనను తమ బిడ్డగా భావించి గెలిపిస్తే ఎంపీ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులను తీసుకువచ్చి గజ్వేల్ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే రైతులకు సబ్సిడీ అందజేస్తామన్నారు. అదేవిధంగా రుణమాఫీని కూడా అందిస్తామన్నారు. నిరుద్యోగులకు విద్యార్థులకు ఉద్యోగాలు కనిపించే బాధ్యత తీసుకుంటానన్నారు..మహిళలకు ఎంపీ విధుల నుంచి 10% అందిస్తానని ప్రమాణం చేస్తున్నానన్నారు.

పేదింటిలో పుట్టిన నాకు ప్రజల కష్టసుఖాలు నాకు తెలుసు అన్నారు.ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేని అన్నారు. మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి శివార్ వెంకటాపూర్ గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచులు వార్డు మెంబర్లు ఆయా గ్రామాల బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు మల్లేష్ గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కనకయ్య గౌడ్,తిరుమల్ రెడ్డి,గోపాల్ రెడ్డి,ములుగు మండలం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్,నరసింహులు, మండల పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Similar News