బీజేపీకి ఓటేస్తే ఐటీ దాడులే

బీజేపీకి ఓటు వేస్తే ఐటీ దాడులు తప్పవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు.

Update: 2024-05-05 15:50 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : బీజేపీకి ఓటు వేస్తే ఐటీ దాడులు తప్పవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సిద్దిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్య వైశ్యుడు మహాత్మా గాంధీ ని చంపిన గాడ్సేను బీజేపీ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా పొగిడారన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా పుట్టకముందే మహాత్మా గాంధీ రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అన్నారన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు కలిస్తేనే భారతదేశం అన్నారు.

    శ్రీరాముని పేరిట ఓట్లు వేస్తే ప్రతిరోజూ ఐటీ దాడులు తప్పవని ఆర్యవైశ్యులను, వ్యాపారస్తులను హెచ్చరించారు. ఇందిరాగాంధీ మొదలు రాహుల్ గాంధీ వరకు దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి 25వేల ఓట్ల మెజార్టీ ఎక్కువగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని కోరారు. అంతకుముందు ముస్తాబాద్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ, నాయకులు తాడూరి శ్రీనివాస్ గౌడ్, గంప మహేందర్, దాస అంజయ్య, అత్తు ఇమామ్, ముద్దం లక్ష్మి, బొమ్మల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Similar News