బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ కాలుష్యంపై తనిఖీ

జిల్లాలో సదాశివపేట మండలంలోని బ్లూ క్రాఫ్ట్ కాలుష్య కారక పరిశ్రమ వల్ల పర్యావరణం దెబ్బతింటున్నదని, కాలుష్యానికి కారణాలను గుర్తించి నివేదికను సమర్పించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డిని, కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యులను కలెక్టర్‌ శరత్ ఆదేశించారు.

Update: 2023-02-03 12:20 GMT

దిశ,సదాశివపేట : జిల్లాలో సదాశివపేట మండలంలోని బ్లూ క్రాఫ్ట్ కాలుష్య కారక పరిశ్రమ వల్ల పర్యావరణం దెబ్బతింటున్నదని, కాలుష్యానికి కారణాలను గుర్తించి నివేదికను సమర్పించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డిని, కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యులను కలెక్టర్‌ శరత్ ఆదేశించారు. పరిశ్రమను తనిఖీ చేసి, నివేదిక సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి శుక్రవారం పరిశ్రమను , పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదాశివపేట మండలంలోని నంది కంది సమీపంలో ఉన్న ఒక పరిశ్రమ నుంచి వ్యర్ధ పదార్ధాలు విడుదల అవుతున్నాయని, గత వారం 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయని పరిసర గ్రామాల ప్రతినిధులు, ప్రజలు ఫిర్యాదు చేశారు.

    దీనికి తోడు పలు దినపత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా కాలుష్యం వెదజల్లే పరిశ్రమను తనిఖీ చేశామని అధికారులు తెలిపారు. నివేదికలను రూపొందించి, ఉన్నతాధికారులకు సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజల, ప్రజాప్రతినిధులతో అభిప్రాయం సేకరించామన్నారు. వీరితోపాటు సంబంధిత జిల్లా శాఖల అధికారులు , నంది కంది, వెల్టూర్, ముబారక్ పూర్ ,గొల్లగూడెం, తదితర గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు , మండల స్థాయి, అధికారులు పాల్గొన్నారు.

Similar News