100 సార్లు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ సవరించింది: రఘునందన్ రావు

కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. గురువారం గజ్వేల్ మండలం రిమ్మనగూడలో రఘునందన్ రావు ప్రచారం నిర్వహించారు.

Update: 2024-05-02 10:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. గురువారం గజ్వేల్ మండలం రిమ్మనగూడలో రఘునందన్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని బీజేపీ ఏనాడూ అగౌరవ పర్చలేదని అన్నారు. ఇప్పటికీ 126 సార్లు రాజ్యాంగాన్ని సవరించారని గుర్తుచేశారు. అందులో 100 సార్లు కాంగ్రెస్ పార్టీనే మార్పులు చేసిందని అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ వంద అబద్ధాలు ఆడితే.. రేవంత్ రెడ్డి వెయ్యి అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకుముందు బీఆర్ఎస్ అభ్యర్థిపై రఘునందన్ రావు విమర్శలు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు హరీష్ రావుకు పాలేరుగా ఉన్నారని.. కాని దుబ్బాకకు ఎన్నడూ రూపాయి తేలేదని విమర్శించారు. ఇప్పుడు మరో పాలేరు తయారు అయ్యారని.. కలెక్టర్‌గా పనిచేసిన వ్యక్తి హరీష్ రావు వద్ద పాలేరుగా పనిచేందుకు రెడీ అయ్యారని సెటైర్ వేశారు. తాను ప్రజలకు పాలేరును అని చెప్పారు. మెదక్, దుబ్బాక అభివృద్ధిపై బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఓబీసీలకు రావాల్సిన సీట్లను తీసుకుపోయి ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. ఆ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News